బుల్లితెర యాంకర్ రవికి ఆడియ‌న్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘సమ్‌థింగ్ స్పెషల్’ ‘పటాస్, ఢీ’’ లాంటి ప్రోగ్రామ్స్‌తో ప్రేక్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు ఆయ‌న‌.  అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

తనకు చిరంజీవి గురువు అని, నాగార్జున సహాయంతో యాంకరింగ్ మొదలుపెట్టానని చెప్పాడు. బాలకృష్ణ గురించి ప్ర‌స్తావిస్తూ... ఎవడెవడో సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్ కామెంట్స్ చేయడం సరికాదని అన్నాడు. బాలకృష్ణ, చి రంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ఏజ్‌లో కూడా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారన్నారు. వాళ్లకు ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా భరించి మనల్ని నవ్విస్తుంటే అలా కెమెంట్స్ చేయొద్దని అన్నాడు.  


ఇక పవన్ కళ్యాణ్ పక్కన తమ్ముడిగా ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్స్ ఏంటని అడగగా.. తమ్ముడిగా ఏంటి నాయనా... ! ఆయన పక్కన పనోడిలా ఛాన్స్ వచ్చినా చేస్తానని అన్నాడు రవి. పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యా అని పిలిచే అవకాశం వచ్చిందంటే అదో డిఫెరెంట్ ఫీలింగ్ అని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: