ముస్లింల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శుభాకాంక్ష‌లు తెలిపారు. కొవిడ్‌-19 ప‌రిస్థితుల మ‌ధ్య  రంజాన్‌ను జ‌రుపుకోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఈ రోజు ఉద‌యం 11గంట‌ల‌కు మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డి చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లుపై ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్‌కు ముందే క‌రోనా మ‌హ‌మ్మారి ఓడిపోవాల‌ని ప్రార్థించాన‌న్నారు. అలాగే.. తీర్థంకర స్వామి రిషభదేవ పవిత్ర వార్షికోత్సవం, బసవ వార్షికోత్సవం సందర్భంగా లింగాయత్ సమాజానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 

 ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్‌పై యుద్ధం కొన‌సాగుతోంద‌ని, భార‌త్ ప్ర‌జ‌లు ఐక‌మ‌త్యంతో చేస్తున్న పోరాటాన్ని యుద్ధాన్ని ప్ర‌పంచ గ‌మ‌నిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. మ‌నం స‌రైన ప‌ద్ధ‌తిలోనే క‌రోనాపై యుద్ధం చేస్తున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చెప్పారు. క‌రోనాపై ప్ర‌తీ పౌరుడు ఒక సైనికుడిలా పోరాడుతున్నాడ‌ని అన్నారు. ప్రాణాల‌కు తెగించి క‌రోనా పేషెంట్ల‌కు వైద్యులు, న‌ర్సులు రాత్రింబ‌వ‌ళ్లు వైద్య‌సేవలు అందిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: