టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న హీరోయిన్ ప్ర‌ణీత సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఎంతో చురుగ్గా పాల్గొంటారు.. తాను నిర్వ‌హిస్తున్న ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశ వ్యాప్తంగాఆ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో పేద‌లు, వ‌ల‌స‌కూలీలు, కార్మికులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అలాంటి వారికి త‌నవంతు సాయం అందించేందుకు హీరోయిన్ ప్ర‌ణీత ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

తాజాగా.. ఆమె స్వ‌యంగా అన్నం వండారు. ఆ త‌ర్వాత ఆహారాన్ని ప్యాకెట్ల‌లో నింపారు. ఈ ప‌నులకు సంబంధించిన‌ ఫొటోలను ఆమె ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. మంచి ఆలోచ‌న‌ల నుంచే ఆనందం పుడుతుంద‌ని, మీరు నూరేళ్ల సంతోషంగా జీవించాల‌ని కోర‌కుంటున్న‌ట్లు తార‌క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ముందుకూడా మ‌రో ట్వీట్ చేశారు తార‌క్‌. అందంతోకాదు.. మీరు మ‌న‌సుపెట్టి అన్నం వండుతున్నారంటూ తెగ‌పొగిడేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: