లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు సమయానుసారంగా సూచనలు ఇస్తూనే ఉన్నారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ నరల్ బిపిన్ రావత్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చే సూచనలపై కేబినెట్ కార్యదర్శుల సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పూర్తి అదుపులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో మాట్లాడుతూ తగిన సూచనలిస్తున్నారని రావత్ తెలిపారు.

 

అటు సరిహద్దు వద్ద రక్షణ విధుల్లో ఉన్న జవాన్లలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని రావత్ స్పష్టం చేశారు. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, విమానాల వద్ద విధులు నిర్వహించే జవాన్లు కూడా కరోనా బారిన పడలేదని చెప్పారు. త్రివిధ దళాల శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులున్నా శిక్షణా కార్యక్రమాలు యాథాతథంగా సాగుతున్నాయని తెలిపారు. తమ వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయని రావత్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: