ప్రాణాల‌కు తెగించి క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స చేస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సులు వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. అంతేగాకుండా.. వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులను కూడా ఈ మ‌హ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్ట‌ర్ బిప్లాబ్ కాంతిదాస్‌గుప్తా క‌రోనాతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయ‌న వైర‌స్ సోక‌గా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న భార్య‌కు కూడా క‌రోనా సోకింది. డాక్ట‌ర్ మృతిప‌ట్ల‌ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ట్విట్టర్‌లో సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ఆయన చేసిన త్యాగం మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుందని, కొవిడ్ వారియ‌ర్స్ క‌రోనా మ‌హ‌మ్మారితో మ‌రింత సంక‌ల్పంతో పోరాడాల‌ని ఆయ‌న కోరారు. వైద్యారోగ్య శాక ఉన్న‌తాధికారి మృతి చెంద‌డంతో వైద్య‌వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా, ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పెద్ద‌సంఖ్య‌లో వైద్య సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులకు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ, ముంబైలో అధిక సంఖ్య‌లో కొవిడ్‌-19 బారిన‌ప‌డ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: