ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. మ‌న ప‌క్క‌నే ఉన్న బంగ్లాదేశ్‌లోనే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. తాజాగా.. బంగ్లాదేశ్‌లోని 31 ఇస్కాన్ సభ్యులు కొవిడ్ -19 బారిన‌ప‌డ్డారు. ఢాకాలోని ఇస్కాన్ ఆలయానికి చెందిన వారికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు వైరస్ మ‌రింత‌గా వ్యాప్తి చెందకుండా ఉండటానికి భవనాన్ని మూసివేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. స్వామీబాగ్ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) ఆశ్రమంలో 31 మంది కరోనావైరస్ బారిన‌ప‌డ్డార‌ని జెండారియా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌చార్జి సాజు మియా పేర్కొన్నారు.

 

ఇక ఇప్ప‌టివ‌ర‌కు బంగ్లాదేశ్‌లో దాదాపు 5,000 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా సుమారు 140 మంది మరణించారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇస్కాన్ సేవ‌లు కొన‌సాగుతున్నాయి. అయితే.. ఆల‌య సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ‌డం ఇదే మొద‌టిసార‌ని ప‌లువురు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: