ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. ఏపీలో అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్‌ పరిణామాలు, ముందుముందు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఏపీలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చర్యలను ఫోన్ ద్వారా ముఖ్య‌మంత్రి జగన్‌ వివరించారు. రాష్ట్రంలో వేగ‌వంతంగా కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమస్థానంలో ఉందని అమిత్‌షాకు ఈ సంద‌ర్భంగా జగన్ చెప్పారు.

 

అంతేగాకుండా.. ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపుల ప్రభావంపై మంతనాలు జరిపినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ అమ‌లులో, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో, ద‌క్ష‌ణ కొరియా నుంచి ల‌క్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను తెప్పించ‌డం.. త‌దిత‌ర అంశాల‌పై కూడా అమిత్‌షా సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం కూడా ఉంది. గుంటూరు, కృష్ణా, క‌ర్నూలు జిల్లాలో అమాంతంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెర‌గ‌డంపై కూడా అమిత్‌షా అడిగితెలుసుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: