ప‌క్షుల్లో సార‌స్ క్రేన్ ప‌క్షులు ఎంతో ప్ర‌త్యేకం.. ఎగిరే ప‌క్షుల్లో అతి పొడ‌వైన ప‌క్షి ఇదే. సుమారు 5.5 అడుగుల(1.8మీట‌ర్లు) ఎత్తుతో ఉంటాయి. చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. రెండు సార‌స్ క్రేన్స్ పక్షులు ప‌‌చ్చిక‌బ‌య‌ళ్ల‌లో గాల్లోకి ఎగురుతూ చేస్తున్న‌డ్యాన్స్ చేస్తుండ‌గా వీడియోల బంధించారు ప‌క్షి ప్రేమికులు. ఈ రెండు ప‌క్ష‌లు కూడా  మంచి టైమింగ్‌తో కొసిరికొసిరి ఎగ‌ర‌డం చూసేందుకు మాత్రం సూప‌ర్బ్‌గా ఉంది. ఈ జంట ప‌క్షులు చేస్తున్న డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

ఈ ప‌క్షులు సాధార‌ణంగా ద‌క్షిణాసియా ప్రాంతాల్లోని చిత్త‌డి నేల‌ల్లో నివ‌సిస్తుంటాయి. కాలానుగుణంగా ఆగ్నేయాసియాలోని డిప్టెరో కార్ప్ అడ‌వులు, ఆస్ట్రేలియా అడ‌వులు, గ‌డ్డి భూములకు త‌ర‌లివెళ్తుంటాయి. ఈ వీడియోను చూసిన వారు ఇత‌రుల‌కు షేర్ చేస్తున్నారు. క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భ‌యంభ‌యంగా గ‌డుపుతున్న వారు ఈ వీడియో చూసి కాస్త క‌రోనాను మ‌రిచిపోతున్నారు. మీరు కూడా ఈ మీడియోపై ఓ లుక్కేయండి.. ఈ జంట పక్షుల డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయండి..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: