తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా పై డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతగా పోరాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.  అనుక్షణం కంటికి రెప్పలా డాక్టర్లు, పోలీసులు కాపాడితే.. బయట ఎలాంటి ప్రమాదం లేకుండా పారిశుద్ద్య కార్మికులు పని చేస్తున్నారు.  అయితే ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ బయట జరిగే విషయం గురించి తెలుపుతున్న మీడియా కూడా ముఖ్యమే అంటున్నారు.  అయితే మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.  

 

ఈ క్రమంలో కొంత మందికి కరోనా సోకిన ప్రమాదాలు కూడా జరిగాయి.  ముంబాయి, తమిళనాడు లో జర్నలిస్టులకు కరోనా సోకింది.   తాజాగా ‘కరోనా’ నేపథ్యంలో పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలోనూ కొందరు జర్నలిస్టులు వార్తా సేకరణకు వెళ్లిన సమయంలో ‘కరోనా’ బారినపడ్డారని, పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. 

 

హర్యానా మాదిరి ఏపీలోనూ జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని  కోరారు .  అంతేకాదు లాక్ డౌన్ తో తయారీ, సేవారంగం, వ్యాపార సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయాయని అన్నారు. సాధారణ స్థితి వచ్చే వరకు విద్యుత్ బిల్లులను వాయిదా వేయాలని, చిరు వ్యాపారస్తులకు మూడు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని, అప్పుడే వాళ్లు ఆర్థిక సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉందని తన లేఖలో కన్నా అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: