మహారాష్ట్రలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను కంటి మీద క‌నుకులేకుండా చేస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నా... చాప‌కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తూనే ఉంది. పుణెలో క‌రోనా పాజ‌టివ్ కేసుల సంఖ్య  అంత‌కంత‌కూ పెరిగిపోతు న్నాయి. 

 

గడిచిన 12 గంటల్లోనే ఇక్కడ కొత్తగా మరో 49  పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నాటికి అందిన స మాచారం మేరకు 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం లాక్ డౌన్ ను క‌ఠినంగా అమ‌లు చేస్తోంది‌. మ‌రోప‌క్క కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా  మే 3వ తేదీ వరకు లాడ్ డౌన్ నిబంధనలను \అమలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: