ప్రపంచంలో మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా ఇప్పుడు అన్ని దేశాల్లో విస్తరించింది.  ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.  మన దేశంలో గత నెల నుంచి కరోనా విస్తరించడం మొదలైంది.  ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించారు.  వాస్తవానికి ఈ నెల 14 వరకు ఉన్నా..  కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్ డౌన్ మే 3 వరకు పెంచారు.   దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

తాజాగా మరోసారి సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ సమావేశం కానుండడం ఇది మూడోసారి. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.  

 

కాగా, కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నాయి. దీనిపైనా మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: