ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా బాధితుల సంఖ్య మూడు రోజుల్లోనే 1100కు చేరువలో ఉంది. అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలోనమోదయ్యాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా వైసీపీకి చెందిన ఓ ఎంపీ కుటుంబానికి అంత‌టికి క‌రోనా పాజిటివ్ న‌మోదు అయినట్టు స‌మాచారం. ఆయ‌న కుటుంబంలో మొత్తం ఆరుగురికి క‌రోనా సోక‌గా... వీరిలో నలుగురు వైద్యులే ఉన్నార‌ట‌.

 

ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులకు,14 ఏళ్ల బాలుడు తోపాటు, 83 ఏళ్ల తండ్రికీ వైరస్ నిర్ధారణ అయింది. ఆరుగురిలో నలుగురు వైద్యులు అని వార్తలు వచ్చాయి. దీనిపై స‌ద‌రు ఎంపీ సైతం అవున‌ని క్లారిటీ ఇవ్వ‌గా.. వారంతా హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతున్న‌ట్టు కూడా ఆయ‌న చెప్పార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అటు ప్ర‌భుత్వం... ఇటు ప్ర‌జ‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనాకు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: