మద్య ప్రదేశ్ లోని ఓ సెలూన్ షాప్ కి వెళ్లి ఆరుగురికి కరోనా పాస్టివ్ వచ్చిన ఘటన ఖర్గోనే జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టు దిట్టం చర్యలు చేపడుతూనే ఉంది కానీ ప్రజలు వినకుండా వారి వారి నిత్యా కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. కరోనా మహమ్మారిని ఒకరినుండి మరొకరికి వ్యాపింప చేస్తూనే ఉన్నారు. అయితే మధ్య ప్రదేశ్ లోని కార్గోనే జిల్లాలోని బార్గన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

IHG

 

అయితే సెలూన్ కి వెళ్లిన 6 కి ఒకేసారి కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇండోర్ లోని ఓ హోటల్ లో పనిచేస్తున్న ఓ  వ్యక్తి బార్గన్ సెలూన్ కి వెళ్లడం జరిగింది. అయితే బార్బర్ అతనికి వదిన క్లాత్ ఇతర వ్యక్తులకు వాడడంతో కరోనా ఇతరులకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వారికీ క్షవరం చేసిన బార్బరుకి కరోనా నెగటివ్ రావడం ఇక్కడ పెద్దవిశేషం. ఇప్పటివరకు మధ్య ప్రదేశ్ లో 2019  కేసులు నమోదు కాగా 103  మరణాలు సంభవించాయి మరియు 302  మంది రికవరీ అయ్యారు 1685  యాక్టీవ్ కేసులు ఎంపీ లో ఉన్నాయ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: