ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఎవ‌రికి వారు చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ లేవు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే క‌రోనా మ‌ర‌ణాలు రెండు ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనాను కట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా యాంటీ డ్ర‌గ్ మ‌నుష్యుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా రోగులకు అందిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్  ప్ర‌యోగిస్తున్నారు. 

 

అయితే ఈ డ్ర‌గ్ మ‌నుష్యుల్లో ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని  రోజుల కిందట తాము ఎలుకలపై ప్రయోగాలు జరిపామని.. వాటిల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పారు. దీనిని బ‌ట్టి రెమ్‌డెసివిర్ వాడితే పురుషుల వీర్య క‌ణాలు త‌గ్గ‌డం లేదా అవి త‌మ సంతాన ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కోల్పోవ‌డం ఎక్కువుగా జ‌రుగుతోంద‌ట‌. 

 

దీని వ‌ల్ల భ‌విష్యుత్తులో శృంగార సామ‌ర్థ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని అంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఈ డ్ర‌గ్ అందుబాటులోకి వ‌స్తుందా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: