ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన ఖుషీ సినిమా ప‌వ‌న్‌ను యూత్‌లో తిరుగులేని ప‌వ‌ర్ స్టార్‌ను చేసేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి స‌రిగ్గా నేటికి 19 సంవ‌త్స‌రాలు అవుతోంది.  అప్ప‌ట్లోనే దాదాపు రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించింది. ఏప్రిల్ 27,2001న విడుద‌లైంది. శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌.జె. సూర్య ద‌ర్శ‌కుడు. ఇక ఈ సినిమాలో చాలానే హైలెట్స్ ఉన్నాయి. ప‌వ‌న్ డ్రెస్ స్టైల్‌, హెయిర్ స్టైల్‌.. ప‌వ‌న్ వేసుకున్న బ్యాగ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

 

ఖుషి చిత్రంలో ప‌వన్ డ్రెస్సింగ్ స్టైల్‌తో పాటు ఆయ‌న లుక్ కూడా అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. అందులో ఆయ‌న ధ‌రించిన బ్యాగ్ మ‌రింత స్పెష‌ల్ అట్రాక్ష‌న్. సిద్దు అనే పాత్ర‌లో ప‌వ‌న్‌, మ‌ధు అనే పాత్ర‌లో భూమిక న‌టించ‌గా, వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన ప్రేమాయ‌ణంని అనేక మ‌లుపులు తిప్పుతూ అదిరే క్లైమాక్స్‌తో ముగుస్తుంది. 

 

బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. ఇక ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఎవ‌రో కాదు ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణుదేశాయ్‌. ఆ స‌మ‌యంలో వీరి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. చివ‌ర‌కు వీరు స‌హ‌జీవ‌నం ప్రారంభ‌మ‌వ్వ‌డం జ‌రిగాయ‌ని చెపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: