నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ చైనా. కనీస నియమాలను పాటించకుండా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడంలో ప్రపంచంలోనే పేరుపొందిన దేశం చైనా. దాదాపు 8.9 కోట్ల ఫేస్ మాస్క్ లను చైనా ప్రభుత్వం  ఆదివారం రోజున జప్తు చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రాసెస్ లో పొరుగు దేశాలన్నీ కూడా  మాస్క్ ల కోసం చైనాకు ఆర్డర్ ఇచ్చాయి.

IHG

కానీ ఆ నాసిరకం మాస్క్ లను వాడటానికి మరియు ఉపయోగించడానికి వీలు లేక పోవడంతో ఆర్డర్ చేసిన దేశాలన్నీ కూడా చైనా ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాయి. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ అధికారులు 1.6 కోట్ల వ్యాపార సంస్థలపై దాడులు చేయగా దాదాపు 8.9 కోట్ల మాస్క్ లను మరియు 4.8 లక్షల రక్షణ పరికరాలను జప్తు చేశారు. చైనాలో వీటి విలువ దాదాపు 11 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటాయని చైనా అధికారులు వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: