ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కొవిడ్‌-19 అత‌లాకుత‌లం చేస్తోంది.  రాష్ట్రంలో కరోనా వైర‌స్ మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పె రిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో (ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి సోమవారం ఉదయం 9:00 గంటల వరకు) కొత్త‌గా 80 కేసులు నమోదయ్యాయి. 

 

ముఖ్యంగా గుంటూరు జిల్లాను క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంత కంత‌కూ పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో జిల్లా ప్ర‌జ‌ల్లో తీవ్ర భ‌యాందోళ‌న నెల‌కొంది. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 237కు చేరాయి. జిల్లాలో లాక్ డౌన్ ప్రారంభం నుంచే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

 

రాష్ట్రంలో అత్యధిక కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా రెండో స్థానంలో ని లిచింది. నిన్న మూడు కేసులు నమోదు అయినట్లు చెప్పిన అధికారులు సోమవారం ఒక్క రోజే 23 కేసులు నమోదు అయినట్లు ప్ర‌క‌టించారు.  ఇంకా జి ల్లాలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంద‌ని అధికారులు పేర్కొన‌డం గ‌మనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: