తెలుగు రాష్ట్రాల్లో ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ మాత్రం ప్రబలి పోతూనే ఉంది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యికి పెరిగిపోయింది.  ఏపిలో  కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 80 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో కొత్తగా 13, గుంటూరులో 23, కృష్ణా జిల్లాలో 33, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 7 కేసులు నమోదయ్యాయి. 

గత నెల నుంచి మొదలైన ఈ కరోనా వైరస్ మెల్లి మెల్లిగా తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తుంది.  80 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది.  ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.   కర్నూలులో అత్యధికంగా 292, ఆ తర్వాత గుంటూరులో 237 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 911గా ఉంది. 235 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: