లాక్‌డౌన్ అమ‌లు, క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌లు, త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఈరోజు ముఖ్య‌మంత్రుల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ.. అంద‌రం క‌లిసిక‌ట్టుగా క‌రోనాపై పోరాడాల‌ని కోరారు. లాక్‌డౌన్ వ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక ఇదే స‌మ‌యంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల నుంచి ఇచ్చిన మిన‌హాయింపుల‌పై ముఖ్య‌మంత్రుల నుంచి ఆయ‌న అభిప్రాయాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ రెడ్డి ప‌లు అంశాల‌ను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌ను య‌థావిధిగా కొన‌సాగించాల‌ని కోరినట్లు తెలిసింది.

 

రాష్ట్రంలో వ్య‌వ‌సాయ‌, దాని ఆధారిత రంగాల‌కు మిన‌హాయింపులు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌తంలో కూడా కోరారు. ఇప్పుడు కూడా అవే అంశాల‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో జోన్ల వారీగా అంటే.. రెడ్‌, ఆరెంజ్‌, రెడ్‌జోన్ల వారీగా స‌డ‌లింపులు ఇవ్వాల‌ని మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దృష్టికి తీసుకొచ్చిన‌ట్లు స‌మ‌చారం. జోన్ల వారీగా స‌డ‌లింపులు ఇస్తే.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు తొల‌గిపోతాయ‌న్న‌ది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో కార్య‌క‌లాపాలు  అయితే.. ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కూడా 80కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 1177 కు పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: