దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌, క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్ స‌డ‌లింపులు, మే 3వ తేదీ త‌ర్వాత ఎలా ముందుకు వెళ్లాలి..? అన్న అంశాల‌పై ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ వ్యాప్తినిరోధానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు బాగా ప‌నిచేస్తున్నాయ‌ని, లాక్‌డౌన్ విధింపువ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని, దేశంలో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతున్నామ‌ని అన్నారు. అయితే.. మే 3వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు, జిల్ల‌ల్లో ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని, క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేని ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

 

ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల వారీగా ముఖ్య‌మంత్రుల‌తో ఆయ‌న మాట్లాడారు. అయితే.. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న ప్ర‌తీ ముఖ్య‌మంత్రి రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ఆర్థిక‌ ప్యాకేజీ ఇవ్వాల‌ని కోరారు. లాక్‌డౌన్ అమ‌లు, ప్ర‌జ‌ల ఇబ్బందులు తీర్చేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రులు కోరారు. అయితే.. మ‌రి ఈ ముఖ్య‌మంత్రుల కోరిక‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఏమేర‌కు తీరుస్తారో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: