చైనా నుంచి దిగుమతి అవుతున్న కరోనా ర్యాఫిడ్  టెస్టింగ్  కిట్లను   అధిక ధరకు  అమ్మిన ఉదంతం చెన్నై నగరంలో చోటు చేసుకుంది. ర్యాపిడ్  టెస్టింగ్ కిట్ల  దిగుమతి చేసుకున్న సంస్థ షాన్ బయోటెక్ మరియు పంపిణీదారు మధ్య వివాదం తలెత్తడంతో ఈ విషయం బయటకు పొక్కింది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న దిగుమతి దారు మ్యాట్రిక్స్ ఒక్కో టెస్టింగ్ కిట్  రూ. 245 కు కొనుగోలు చేసి వాటిని రియల్ మెటబాలిక్స్,  ఆర్క్ ఫార్మాస్యూటికల్స్   ఒక్కో కిట్ ను 600 రూపాయల చొప్పున ప్రభుత్వానికి అమ్మింది. ఈ ధర కొన్న ధర తో పోల్చుకుంటే 60 శాతం ఎక్కువ గా వసూలు చేసినట్లు  దిగుమతి దారు పేర్కొన్నారు. చైనా నుంచి దిగుమతి దారు మ్యాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను కొనుక్కున్న సంస్థ షాన్ బయోటెక్.

IHG

 షాన్ బయోటెక్ ఆ ఒక్కో కిట్ ను  ఆరు వందల రూపాయల చొప్పున  చెన్నై గవర్నమెంట్ కి అమ్మింది అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో. తమిళనాడు గవర్నమెంట్  తమతో చేసుకున్న అగ్రిమెంట్ కు వ్యతిరేకంగా దిగుమతి దారు మ్యాట్రిక్స్ పనిచేసిందని   రియల్ మెటబాలిక్స్ ఢిల్లీ హైకోర్టు కు ఫిర్యాదు చేసింది. మ్యాట్రిక్స్ సంస్థ  తమను పక్కనపెట్టి    షాన్ బయోటెక్ ద్వారా తమకు ఉత్పత్తులను అమ్మి ఉందని కోర్టుకు తెలియజేసింది. ఢిల్లీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత అధిక ధరలు వసూలు చేయొద్దని, జిఎస్టి తో కలిపి ఒక్కో కిట్ రూ 400కు అమ్మాలని స్పష్టం చేసింది. కరోనా  కాలంలో తలెత్తుతున్న కష్ట పరిస్థితుల కారణంగా  లాభాపేక్ష మాని తక్కువ ధరకే అమ్మాలని కోర్టు హితవు పలికింది. కరోనా పోరులో  రక్షణ పరికరాలు  టెస్టింగ్ కిట్లు అవసరమని పేర్కొంది. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని  ఇరు సంస్థలకు హితవు పలికింది. అయితే టెస్టింగ్ కిట్లను అధిక ధరల విషయమై వైద్య పరిశోధనా మండలి ఐ సి ఎం ఆర్ స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: