కరోనా వైరస్ నేపధ్యంలో మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పై ఆర్ధిక ఒత్తిడి ఎక్కువైంది. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒత్తిడి తగ్గించడానికి గానూ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది. 

 

రూ .50 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాన్ని (ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్) రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. ఈ పథకం ఈ రోజు నుంచి అమలు లోకి వస్తుంది. మే 11, 2020 వరకు లేదా కేటాయించిన మొత్తాన్ని ఉపయోగించుకునే వరకు ఉంటుందని, ఏది ముందు అయితే అది అని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: