ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  అయితే ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా ప్రభావం తక్కువే ఉన్నా... అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినవారి వల్లే అంటున్నారు. మరో కారణం ఇటీవల మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వల్ల అంటున్నారు.  తాజాగా  భారత్‌లో కరోనా వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం నాటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 

 

భారత్‌లో మొత్తం కరోనా నిర్ధారిత పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.  భారత్‌లో కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతం 22.17గా ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.ఒక్కరోజులో 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

భారత్‌లో ఇప్పటి వరకూ 6184 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  అదృష్టం ఏంటంటే..  దేశంలోని 16 జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా కొత్తగా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.  ఈ జాబితాలో కొత్తగా మహారాష్ట్రలోని గోండియా, కర్ణాటకలోని దేవనగరి, బీహార్‌లోని లఖి సరయి జిల్లాలు చేరినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: