సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తమదైన మార్క్ చాటుకున్నారు సురేఖ,  హేమా,  ర‌జిత. టీవి సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తమదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. తాజాగా ఈ నటీమణులు తమ వంతు సహాయం కరోనా  బాదితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. రెక్క ఆడితే గాని డొక్క ఆడ‌ని కుటుంబాల‌కు ఆదాయ వ‌న‌రులు అందుబాటులో లేవు. ఇలాంటి వారిలో సినీకార్డులేనివారిని ఎవరూ పట్టించుకోట్లేదు. సీనీ కార్డులేని వారిని గుర్తించి   వారికి అవసరమైన వస్తువులు, డబ్బును అందించారు.


హేమా, సురేఖా వాణి, ర‌జిత వంటి నటీమణులు సినీకార్డులేని కార్మికుల‌కు సాయం చేశారు. వీరు మాత్ర‌మే కాదు హేమ‌, సురేఖా పిల్ల‌లు కూడా వారు కూడ‌బెట్టుకున్న డ‌బ్బును డొనేట్ చేయ‌డానికి వ‌చ్చారు.  ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో మంది తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

 

ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోను సినీ నటులు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ సీసీసీ చారిటీ స్థాపించి విరాళాలు సేకరించి పేద సినీ కార్మికులను ఆదుకుంటున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: