ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత నాలుగు రోజుల నుంచి 50కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు వరకు 1177 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 
 
జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో టెస్టింగ్ సామర్థ్యం పెంచామని.... రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక సంఖ్యలో పరీక్షలు జరుపుతున్నామని అన్నారు. ఏపీలో టెస్టింగ్ సామర్థ్యం పెంచడం వల్లే పూర్తి స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ సగటు కంటే ఏపీలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. 
 
అతంలో ఇలాంటి విపత్తులు వస్తే పరీక్షలు చేసే సదుపాయం లేదని పేర్కొన్నారు.ఏపీలో సగటున ప్రతి పది లక్షల మందికి 1396 కరోనా పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: