ఏపిలో పరిస్థితులపై సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. ఎక్కడా ఎవరికీ కష్టం లేకుండా చేస్తున్నామన్నారు సీఎం.   నెల రోజుల్లో మూడు సార్లు రేషన్ అందించే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పేద కుంటుంబానికి వెయ్యిరూపాయాలు సాయం అందించామని అన్నారు. 56 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ అందించాం. ఆర్థిక లోటు ఉన్నా.. సామాన్యుడికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మూడు సార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించామని అన్నారు.  

 

కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించోద్దు అన్నారు. ఆర్థిక లోటు ఉన్నా ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.  కరోనా వస్తుందని.. వచ్చిందని భయపడవొద్దని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుందని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.   కరోనాపై ఎవరూ నిర్లక్ష్యం వహించవొద్దని.. కరోనా ఉన్నట్లుగా 80 శాతం మందికి తెలియనే తెలియదు.  

 

ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా వ్యాప్తి చెందుతుందని అన్నారు. 81 శాతం మందికి ఇళ్లల్లో ఉంటేనే నయమవుతున్నాయి. కేవలం 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు.  ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు..అలా అని నిర్లక్ష్యం చేయొద్దని దేవుడి దయవల్ల అందరూ బాగుండాలని కోరకుంటున్నానని సీఎం జగన్ అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: