ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ క‌రోనా టెస్టుల్లో జాతీయ‌స్థాయిలో సగటున 10 లక్షల జనాభాకు దేశంలో 451 టెస్టులు చేస్తుంటే ఏపీలో 1396 టెస్టులు చేస్తున్నామని ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 6517 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. దేశంలోనే ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించామని... రాష్ట్రంలో 74,551 మందికి పరీక్షలు చేశామని చెప్పారు. 
 
నెల రోజుల్లో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని... క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్ 95 మాస్కులు, పీపీఈలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ప్రకటన చేశారు. విశాఖ, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతిలో క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. 
 
ప్రభుత్వ ఆసత్రుల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. 14400 నంబర్ ప్రత్యేకంగా టెలీ మెడిసిన్ ప్రారంభించామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: