దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశంలో లాక్ డౌన్ విధించారు.  ఈ నేపథ్యంలో బయటకు ఎవరినీ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  కానీ కొంత మంది ఆకతాయిలు మాత్రం ప్రతిరోజూ పోలీసులను విసిగించడమే పనిగా పెట్టుకుంటున్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.  దేశ వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న కఠోర శ్రమకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.  కానీ కొన్ని చోట్ల మాత్రం దుండగులు పోలీసులపై దాడులు చేయడం విచారకరం. తాజాగా ముంబైలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న పోలీసులపై ఆదివారం సాయంత్రం జరిగిన దాడికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.

 

గోవాండి శివాజీనగర్‌లో జనసమ్మర్దం అధికంగా ఉండే మురికివాడ వద్ద  జనం గుంపుగూడారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ జనాలు గుంపులుగా ఉండటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే చెదురు మదురు అయిన కొంత మంది ఆకతాయిలు పోలీసులపై రాళ్లు రువ్వడం ఆరంభించారు. 

 

ఈ రాళ్ల దాడిలో కొంత మంది పోలీసులకు దెబ్బలు తాకాయి.. ఓ కానిస్టేబులు కి చేతికి తీవ్ర గాయం అయ్యింది.  అందులో నలుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇదిలా ఉంటే ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ వారికి రక్షణగా ఉంటున్న పోలీసులపై దాడులు చేయడం ఎంత వరకు న్యాయం ని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: