జన్మనిచ్చిన తల్లి మరియు తండ్రి దైవంతో సమానం అంటారు పెద్దలు. అలంటి తల్లి పైనే కత్తి దూశాడు ఓ దుర్మార్గుడు. యానాం లో ని వంశీ కృష్ణా కాలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కొన్నిరోజులుగా  భార్య భర్తలు కొన్ని విషయాలపై గొడవపడుతున్నారు కానీ సోమవారం నాడు శ్రీనివాస్ కట్టలు తెంచుకున్న కోపంతో తన భార్య పై కొట్లాటకు దిగాడు .

 

IHG

 

ఆమెను తీవ్రంగా కత్తితో గాయపరిచాడు. ఆ గొడవను చూడలేక శ్రీనివాస్ తల్లి అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఈ క్రమంలోనే తన తల్లి పై కూడా పదునెక్కిన కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో తల్లి మరియు అతని భార్య తీవ్రం గా గాయపడ్డారు . గాయపడ్డ అత్త మరియు కోడళ్లను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్నీ ఇంటి ప్రక్కనున్న వాల్లద్వారా పోలీసులు తెలుసుకొని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం పోలీస్ లు తెగ గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: