టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ రెండు మూడేళ్ల క్రితం వ‌ర‌కు వ‌రుస ఆఫ‌ర్లు సొంతం చేసుకుంది. స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించిన ర‌కుల్ రెండు మూడేళ్లుగా  ఛాన్సులు త‌గ్గిపోవ‌డంతో ఆమె హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసి బిజినెస్లు స్టార్ట్ చేసింది. త‌న త‌మ్ముడితో పెద్ద జిమ్ బిజినెస్ కూడా పెట్టించింది. ఓ వైపు అస‌లు హీరోయిన్ ఛాన్సులు లేకుండా విల‌విల్లాడుతోన్న ర‌కుల్‌కు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. క‌రోనా దెబ్బ‌తో ఆమె జిమ్ చైన్ సెంట‌ర్ల తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయాయ‌ట‌. 

 

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆమె వ్యాపారాలు రెండు పువ్వులు.. ఆరు కాయు అన్న‌ట్టుగా ఉండేవ‌ట‌. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవ్వ‌గా వచ్చిన ఆదాయంను పెట్టాల్సి వస్తుంది. గత రెండు నెలలుగా జిమ్‌ సెంట‌ర్లు ఓపెన్ చేయ‌క‌పోవ‌డం ఒక మైన‌స్ అయితే... ఇప్పుడు సిబ్బందికి, అద్దెలు క‌లుపుకుంటే ఆమెకు నెల వ‌చ్చే స‌రికి భారీగానే చేతిచ‌మురు వ‌దులుతోంద‌ట‌. మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు. ఓ వైపు ఆఫ‌ర్లు లేక‌పోవ‌డం... మ‌రోవైపు నెల‌కు ల‌క్ష‌ల్లో ఎదురు పెట్టుబ‌డి పెట్టాల్సి వ‌స్తుండ‌డంతో ర‌కుల్‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.

  

మరింత సమాచారం తెలుసుకోండి: