జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్‌పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి వెళ్లాక చేస్తోన్న ఈ సినిమాను వాస్త‌వంగా మే నెల‌లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమా కోసం ప‌వ‌న్ ముందుగా రు. 45-50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ప‌వ‌న్ రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగానే దిల్ రాజు అంత రెమ్యున‌రేష‌న్ ఫిక్స్ చేశార‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రిగింది. 

 

అయితే ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో అస‌లు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో ప‌వ‌న్ త‌న రెమ్యురేష‌న్‌ను భారీగా త‌గ్గించుకున్న‌ట్టు టాక్‌..?  దిల్ రాజుతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల శ్రేయ‌స్సు కోసం ప‌వ‌న్ ఏకంగా రు. 15 కోట్ల వరకు పారితోషికంను తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.సినిమాకు భారీగా బిజినెస్‌ అయ్యే పరిస్థితి లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

 

ఇక దిల్ రాజు ఈ సినిమా కోసం ఇప్ప‌టికే ఏకంగా రు. 30 కోట్ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టారంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అడ్వాన్స్‌లు, వ‌డ్డీలు క‌లుపుకుంటే రాజుకు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వ‌నే అంటున్నారు. అందుకే ప‌వ‌న్ త‌న వంతుగా రెమ్యున‌రేష‌న్‌ను భారీగా త‌గ్గించుకున్నాడ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: