ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా ఈ వైర‌స్ మహమ్మారి మ‌రింత‌గా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో తాజా క‌రోనా హెల్త్ బులిటెన్ ను ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసింది. ఈ బులిటె న్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 82 కోరోనా కేసులు న‌మోద‌య్యాయి.  గడచిన 24 గంటల్లో (సోమ‌వారం ఉదయం 9:00 గంటల నుంచి మంగ‌ళ‌వారం ఉదయం 9:00 గంటల వరకు) వివిధ జిల్లాల్లో న‌మోదైన కేసుల‌ను హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

 

కర్నూలు జిల్లాలో 40, గుంటూరులో 17, కృష్ణాలో 13, క‌డ‌ప 7,  నెల్లూరులో 03, చిత్తూరు, అనంత‌పురంలో ఒక్కో కేసు న‌మోద‌య్యాయ‌ని ఏపీ ఆరోగ్య శాఖ హె ల్త్ బులెటిన్ వెల్లడించింది.  కాగా కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259కు చేరుకుంది. ప్ర‌స్తుతం 970 మంది ద వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 258 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. క‌రోనా బారిన ప‌డి 31 మంది చ‌నిపోయారు.  కాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 5, 783శాంపిల్ల‌ను ప‌రీక్షించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: