దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేపుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. నిన్న మ్యాక్స్ ఆస్ప‌త్రిలో ఏకంగా 33మంది వైద్య‌సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డివి ష‌యం తెలిసిందే. తాజాగా.. ఢిల్లీలోని బాబు జగ్జీవన్‌ రామ్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలోని 77 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇందులో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఈ ఇద్దరు పోలీసులు కరోనా వైరస్‌ ప్రబలినప్పటి నుంచి ఆ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్నారు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికారులు బీజేఆర్‌ మెమోరియల్‌ ఆస్పత్రిని మూసివేశారు.  

 

క‌రోనా బారిన ప‌డిన మ్యాక్స్‌ ఆస్పత్రి  33 మంది హెల్త్‌ వర్కర్స్ ప్ర‌స్తుతం మ్యాక్స్‌ సాకేత్‌ కొవిడ్‌-19 వార్డుకు తరలించారు. అయితే మ్యాక్స్‌ ఆస్పత్రిలో పని చేసే 10 వేలకు పైగా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఢిల్లీలోని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆస్పత్రి సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇదే ఆస్పత్రిలో 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ తర్వాత 39 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌తో సహా డాక్టర్లు, నర్సులు, పారమెడికల్‌ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప‌రిణామాలు వైద్య‌వ‌ర్గాల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: