మాట తప్పను.. మడమ తిప్పను.. నెరవేరే హామీలే ఇస్తాను.. అవి ఖచ్చితంగా నెరవేరుస్తాను... ఇది ఒకప్పుడు ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాటలు.  అచ్చం తండ్రి మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  ఎన్నికల ముందు ‘ప్రజాసంకల్ప యాత్ర’ సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవెరుస్తూ వస్తున్నారు.   నేడు సీఎం జగన్ ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నాన్నగారు మొదటి సారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకు వచ్చారు.. పేదవారు పెద్ద చదువులు చదివితే వారి బతుకులు బాగుపడుతాయి అని నమ్మారు.

 

వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా నీరుగార్చారు. అందరి ఆశీర్వాదంతో జగనన్న విద్యాదీవెన ప్రారంభించామని అన్నారు సీఎం జగన్.  తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తున్నట్టు తెలిపింది.

 

ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు.జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు పడతాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి సమానమైన, న్యాయమైన విద్య అందుతుందని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని రోజా కొనియాడారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: