కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ మంగ‌ళ‌వారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో తెలంగాణ‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్‌ అక్షరాస్యత, డిజిటల్‌ పాలనా సామర్థ్యాలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని కేంద్రమంత్రి సూచించారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ ప‌లు అంశాల‌ను కేంద్ర‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లాక్‌డౌన్ త‌ర్వాత‌ ఎలా ముందుకువెళ్లాల‌న్న వ్యూహంపై ప‌లు సూచ‌న‌లు చేశారు. కోవిడ్‌ తదనంతర ప్రపంచానికి టెక్‌ సెల్యూషన్స్‌ను త్వరగా అభివృద్ధి చేసి అందించే సామర్థ్యం భారత్‌కు ఉందని కేటీఆర్ అన్నారు.

 

ఈ మేర‌కు ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాన్నిమ‌రింత‌గా ప్రోత్సహించాలన్నారు. ముందుముందు ఇంటర్‌నెట్‌పై మనం ఆధారపడటం పెరిగేకొద్ది నెట్‌వర్క్‌ సామర్థ్యాలు, సైబర్‌ భద్రత సమస్యలు త‌లెత్తుతాయ‌ని, వీటిపై దృష్టి సారించి బలోపేతం చేసుకోవాలన్నారు. విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ మొదలైన వాటిలో డిజిటల్‌ పరిష్కారాలను అన్వేషించడానికి ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల నాయకులు, మేధావులతో కలిపి వ్యూహాత్మక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర‌మంత్రికి కేటీఆర్‌ సూచించారు. కేటీఆర్‌ సలహాల‌ను కేంద్రమంత్రి స్వీక‌రించారు. దీంతో తన సలహాలను అంగీకరించినందుకుగాను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: