దేశంలో కరోనా మహమ్మారి ఎన్ని కష్టాలు పెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే గత నెల నుంచి కరోనా ని అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో అందరూ ఇంటిపట్టున ఉంటున్నారు.  ఇతర దేశాల్లో లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలంటే పోలీసు వచ్చి వారిని సంతోష పర్చుతున్నారు.  ఇటీవల అమెరికాలో ఓ బాలుడికి ఇలాగే పోలీస్ సెక్యూరిటీ వచ్చి ఆ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపింది. తాజాగా ఓ సీనియర్ నెటిజన్ కి పోలీసులు ఒక్కసారే షాక్ ఇచ్చారు. హర్యానా  రాష్ట్రంలోని పంచకుల పోలీసులు ఓ సీనియర్‌ సిటిజన్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

 

కిరణ్‌పూరీ అనే సీనియర్‌ సిటిజన్‌ సెక్టర్‌ 7లో నివాసం ఉంటున్నారు.  దేశంలో ఒంటరిగా ఉంటున్న సీనియర్‌ సిటిజన్స్‌ తమకు పోలీసుల మద్దతు కావాలని, తమ ఇంటిపై ఓ కన్నేసి ఉంచండి అని  రిజస్ట్రేషన్‌ చేసుకునే వీలు ఉంటుంది. ఆ విధంగా కిరణ్‌పూరీ కూడా పంచకుల పోలీస్‌స్టేషన్‌లో రిజస్ట్రేషన్‌ చేసుకున్నారు.  ఈ సందర్భంగా కిరణ్ పూరి పుట్టిన రోజు గుర్తు పెట్టుకొని పంచకుల పోలీసులు ఈ రోజు వారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

 

లాక్‌డౌన్‌ సందర్భంగా, కరోనా నిబంధనలను అనుసరించి గేట్‌ బయటే ఉండి ఆయన చేత కేక్‌ కట్‌ చేయించారు. ఈ సందర్భంగ కిరణ్ పూరి మాట్లాడుతూ.. తాను జీవితంలో ఈ సంతోషాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని.. ఇంత ఆనందం నేను ఎప్పుడూ పొందలేదని ఉద్వేగపూరిగంగా చెప్పారు. ఈ మధుర జ్ఞాపకాన్ని నేను బ్రతికున్నంత వరకు గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: