గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు.  రాజకీయ, సినీ రంగాలపై తనదైన విమర్శలు, ప్రశంసలు కురిపిస్తున్నారు నాగబాబు.  సినీ నటుడు, జనసేన నేత నాగబాబు హలో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  గత కొంత కాలంగా అధికార పార్టీపై తనదైన సెటైర్లు వేస్తూ వస్తున్నారు నాగబాబు. అయితే ప్రస్తుతం కరోనా ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు.  కరోనా కష్టకాలంలో తాను నిధులు సేకరించి అభాగ్యులకు సాయపడుతున్నానని, మీరూ చేయూతనివ్వాలని కోరారు.

 

హెల్ప్ ఏజ్ ఇండియా అనే దాతృత్వ సంస్థ కోసం నిధులు సేకరిస్తున్నాను. హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న కుటుంబాలకు, రోడ్లపై ఉంటున్న నిరాశ్రయులకు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారికి, మురికివాడల ప్రజలకు, దినసరి కూలీలకు నిత్యావసరాలు, రక్షణాత్మక కిట్లు, ఉచిత ఆహారం అందిస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరై తమకు దగ్గర్లో ఉన్న కడు పేదవారికి మీకు తోచిన సహాయం అందించండి.. ఇప్పుడు దేశంలో తోటి వారు ఎంతో కష్టంలో ఉన్నారు.. నిస్సహాయులకు అనేక మార్గాల్లో నా వంతు సాయం చేశాను. ఇక మీ వంతు వచ్చింది. మీకు చేతనైన సాయం అందించండి వాళ్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: