వైజ‌యంతి మూవీస్‌... ఈ బ్యానర్‌లో గ‌త ఐదు ద‌శాబ్దాలుగా అద్భుత‌మైన చిత్రాలు వ‌స్తున్నాయి. ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గట్టుగా చిత్రాల‌ను నిర్మించి తిరుగులేని శ‌క్తిగా ఎదిగింది. అయితే.. ఇంత‌టి ఘ‌న చరిత్ర‌గ‌ల వైజ‌యంతి మూవీస్‌కు అస‌లు ఈ పేరు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు పెట్టారు..? ఎందుకు పెట్టారో..?  తెలుసుకుందాం..  1974లో కే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓ సీత‌క‌థ సినిమాతో 21ఏళ్ల చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ సినీరంగంలో అడుగుపెట్టారు. అయితే.. ఆయ‌న ల‌క్ష్యం.. న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావుతో సినిమా చేయ‌డం.. ఆయ‌న అపాయింట్‌మెంట్‌కోసం ప‌ట్టువ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నాలు చేశాడు. ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్‌ను క‌లిశాడు. మీతో సినిమా తీయాల‌ని అనుకుంటున్న‌ట్లు అశ్వనీద‌త్ చెప్పారు.

 

ఈ సంద‌ర్భంగా బ్యాన‌ర్ ఏమిట‌ని ఎన్టీఆర్ అడిగారు.. కానీ.. అప్ప‌టికీ అశ్వనీద‌త్ బ్యాన‌ర్ ఏర్పాటు చేయ‌లేదు. ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన ఎన్టీఆర్ ఎదురుగా గోడ‌పై క‌నిపిస్తున్న శ్రీ‌కృష్ణుడి ఫొటో చూసి ఇలా ఇలా అన్నార‌ట‌. శ్రీ‌కృష్ణుడి మెడ‌లో ఎన్న‌టికీ వాడిపోని వ‌న్నెత‌గ్గ‌కుండా ఉండే వైజ‌యంతే నీ బ్యాన‌ర్ పేరు అని చెప్పార‌ట ఎన్టీఆర్. అంతేగాకుండా.. త‌న స్వ‌ద‌స్తూరితో రాసి ఇచ్చార‌ట‌. ఇక అప్ప‌టి నుంచి వైజ‌యంతి తిరుగులేని విజ‌యాల‌తో ఐదుద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: