కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గజగజా వణిపోతున్నాయి. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో బ్రిటన్, ఇటలీ దేశాలలో అంతు చిక్కని వ్యాధి వేగంగా ప్రబలుతోంది. రక్తనాళాల్లో వాపు, అధిక జ్వరం లాంటి లక్షణాలతో పిల్లలు ఆస్పత్రులలో చేరుతున్నారు. 
 
వందల సంఖ్యలో పిల్లలు ఆస్పత్రులలో చేరుతూ ఉండటంతో కరోనా మహమ్మారి వల్లే ఈ వ్యాధి వ్యాపించి ఉండవచ్చని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్య నిపుణులు ఇందుకోసం పరిశీలనలు జరుపుతున్నారు. కావసాకీ వ్యాధి తరహా లక్షణాలతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతుండటంతో పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. వైద్యులు ఈ అంతుచిక్కని వ్యాధి గురించి పరిశోధనలు చేస్తున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు అంతు చిక్కని వ్యాధులు ప్రబలుతూ ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: