ప్రపంచాన్ని కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ఒక్క రకమే. కానీ ఇలాంటి వైరస్‌లే మరో 11 రకాలు ఉన్నాయంటూ భారత శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. అవును కరోనా వైరస్ మొత్తం 11 రకాలట. వాటిలో చైనాలోని ఊహాన్‌లో పుట్టినది ‘ఓ’అనే రకం. ఇది కరోనా వైరస్‌లన్నిటీకీ పెద్దన్న లాంటిది.  2019 డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 55 దేశాల్లో వ్యాపించిన కరోనా శాంపిల్స్ ను సేకరించిన భారతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించిన వివిధ దశాలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి.   

 


ప్రపంచంలో ఈ వైరస్ వ్యాప్తి 80శాతం ఉంటె ఇండియాలో 45 శాతం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఊపిరితిత్తుల్లో తయారయ్యే ఏసీఈ2 అనే పోషకాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ పోషకం లోపలికి చేరి దాన్ని కబళించి వేస్తుంది. ఊపిరితిత్తులను నాశనం చేస్తుందని ఫలితంగా మరణం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

 


 పదేళ్ల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన సార్స్-కోవిడ్2 వైరస్ కూడా ఇలాంటి ప్రభావాన్నే బాధితులపై చూపేదని, దానివల్ల కూడా వేలమంది ప్రాణాలు కోల్పోయారని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. కాగా, నా వైరస్ కట్టడి కోసం తయారు చేసే వ్యాక్సిన్ ఏ2ఏ రకం వైరస్ ను నిర్మూలించే విధంగా తయారు చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ఈ వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏ వల్లే ఇది ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందగలుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: