ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవ‌ల ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న బ్రెయిన్ డెడ్ అయి మ‌ర‌ణించాడ‌ని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే  ఆ వార్త‌ల్లో నిజంలేద‌ని... కిమ్ ఓ ర‌హ‌స్య ప్రాంతంలో సేఫ్ గా ఉన్నాడ‌ని ఆ దేశ మీడియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.....  ఈక్ర‌మంలోనే కిమ్ ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కిమ్‌ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్‌ సమర్థురాలిగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. 

 

అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ చిన్నాన్న కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ వారసుల్లో ప్యాంగ్‌ ఇల్‌ చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు అభిప్రాయపడు తున్నారు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: