బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో క్యాన్స‌ర్‌తో చికిత్ పొందుతూ ఆయ‌న మృతి చెందడంతో ఇండ‌స్ట్రీ దిగ్భాంతికి గురైంది. అద్భుత‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయ‌న 54ఏళ్ల వ‌య‌స్సులోనే మ‌ర‌ణించ‌డంతో అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఆయ‌న చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు 2018 లో ఇర్ఫాన్‌ఖాన్ ప్రకటించారు. 2019నుంచి ఆయ‌న విదేశాల‌లో కూడా చికిత్స పొందారు. ఇర్ఫాన్ ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు.

 

 అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో అతని తొలి చిత్రం అకాడమీ అవార్డు సలాం బాంబే !, మక్బూల్ (2004), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పికు (2015 ) మరియు తల్వార్ (2015) హిందీ మీడియం (2017) త‌దిత‌ర చిత్రాల‌తో ఆయ‌న మంచి గుర్తింపు పొందారు. ఇర్ఫాన్ స్లమ్‌డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లైఫ్ ఆఫ్ పై వంటి అనేక అంతర్జాతీయ బ్లాక్ బస్టర్‌లలో కూడా న‌టించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: