ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఇవాళ తెరిచారు. ఆల‌య ద్వారం తెరిచిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ పేరిట తొలి పూజ నిర్వ‌హించారు.  దేవ‌స్థాన బోర్డు మీడియా ప్ర‌తినిధి హ‌రీశ్ గౌడ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  పూజ స‌మ‌యంలో సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించిన‌ట్లు తెలిపారు.  కేవ‌లం 16 మంది మాత్ర‌మే ప్ర‌స్తుతం కేదార్‌నాథ్ ఆల‌యం వ‌ద్ద ఉన్నారు. వారంతా ఆల‌యాన్ని తెరిచేందుకు వ‌చ్చారు. భ‌క్తుల‌ను ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డం లేదు.

 

గ‌త ఏడాది తొలి రోజు పూజ‌, ద‌ర్శ‌నంలో సుమారు మూడు వేల మంది భ‌క్తులు పాల్గొన్నారు. కానీ సారి క‌రోనా నేప‌థ్యంలో ఆంక్ష‌లు ఉన్న విష‌యం తెలి సిందే.  గ‌త ఏడాది చార్‌థామ్ యాత్ర‌లో సుమారు 32 ల‌క్ష‌ల మంది పాల్గొన్నారు. అయితే ఈసారి ఆ సంఖ్య చాలా గ‌ణ‌నీయంగా త‌గ్గే అవ‌కాశాలు ఉన్నా యి. ఇప్ప‌టికీ ఈ ఏడాది యాత్ర ఉంటుందో లేదో తెలియ‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: