‌ఇర్ఫాన్ ఖాన్ త‌ల్లి సైదాబేగం శ‌నివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు ఇర్ఫాన్‌ఖాన్‌ ఆరోగ్యం కూడా బాగోలేక‌పోవ‌డంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నాడు ఇర్ఫాన్‌ఖాన్‌. త‌ల్లి మ‌ర‌ణంతో మ‌రింత‌గా వేద‌న‌కు గురైన ఇర్ఫాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు. చాలా ఏళ్లుగా క్యాన్స‌ర్‌తో పోరాడి పోరాడి ఓడారు. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే త‌ల్లి, కొడుకు మృతి చెంద‌డంతో సినీలోకం క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతోంది. త‌న‌దైన‌ న‌ట‌న‌తో ఇర్ఫాన్‌ఖాన‌ త‌న‌కంటూ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. 1967 జ‌న్మించిన ఇర్ఫాన్‌ఖాన్‌ 54ఏళ్ల వ‌య‌స్సులోనే మ‌ర‌ణించ‌డంతో అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు 2018 లో ఇర్ఫాన్‌ఖాన్ ప్రకటించారు.

 

2019నుంచి ఆయ‌న విదేశాల‌లో కూడా చికిత్స పొందారు. ఇర్ఫాన్ ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు.  అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో అతని తొలి చిత్రం అకాడమీ అవార్డు సలాం బాంబే !, మక్బూల్ (2004), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పికు (2015 ) మరియు తల్వార్ (2015) హిందీ మీడియం (2017) త‌దిత‌ర చిత్రాల‌తో ఆయ‌న మంచి గుర్తింపు పొందారు. ఇర్ఫాన్ స్లమ్‌డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లైఫ్ ఆఫ్ పై వంటి అనేక అంతర్జాతీయ బ్లాక్ బస్టర్‌లలో కూడా న‌టించాడు. ఈ సంద‌ర్భంగా చిత్రనిర్మాత షూజిత్ సిర్కార్ ట్విట్టర్‌లో తెలిపారు. *నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్. మీరు పోరాడారు, పోరాడారు, పోరాడారు. నేను మీ గురించి ఎప్పుడూ గర్వపడతాను .. మ‌నం మ‌ళ్లీ కలుద్దాం .. ఇర్ఫాన్ ఖాన్ వందనం* తీవ్ర ఉద్వేగానికి లోన‌య్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: