బాలీవుడ్ విల‌క్ష‌ణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృతితో హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగిపోయింది. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రితం ఇర్ఫాన్ తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌ మ‌ర‌ణంపై ప ‌లువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. 

 

ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ త‌ల్లి సైదాబేగం శ‌నివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు ఇర్ఫాన్‌ఖాన్‌ ఆరోగ్యం కూడా బాగోలేక‌పోవ‌డంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నాడు ఇర్ఫాన్‌ఖాన్‌. కాగా త‌ల్లి మ‌ర‌ణంతో ఆయ‌న మ‌రింత‌గా వేద‌న‌కు గుర‌య్యారు.  చాలా ఏళ్లుగా క్యాన్స‌ర్‌తో పోరాడి పోరాడి ఓడారు. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే త‌ల్లి, కొడుకు మృతి చెంద‌డంతో సినీ లోకం క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతోంది. త‌న ‌దైన న ‌ట‌న‌తో ఇర్ఫాన్‌ఖాన‌ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో సైనికుడు చిత్రంలో ఇర్ఫాన్ విలన్‌గా న‌టించిన సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: