బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సహజనటుడిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ మృత్యువుతో పోరాడి నేడు కన్నుమూశారు. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకగా, చికిత్స తరువాత కోలుకున్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. పెద్ద పేగు సంబంధిత వ్యాధి సోకడంతో, ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా  ఆయన మ‌ర‌ణించాడని ఆసుపత్రి అధికారికంగా ప్రకటన చేసింది. కాగా, నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు.

 

లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు.  జీవితంలో ఎన్నో కష్టాలకు ఓర్చి నటుడిగా ఆయన ఎదిగారు.  విలన్ పాత్రల్లోనటించిన ఆయన తర్వాత హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. తెలుగు లో మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీలో విలన్ గా నటించాడు.  ఇప్పటి క్యాన్సర్ తో ఇబ్బంది పడ్డ ఆయన తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని ఆయన మిత్రులు మీడియాకు తెలిపారు.

 

ఇర్ఫాన్ ఖాన్‌ మృత దేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఇర్ఫాన్‌ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  ఆయన కెరీర్ లో ఒక జాతీయ పురస్కారం, 4 ఫిలింపేర్ అవార్డులు దక్కించుకొన్నారు. మొదటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకు పోయే మంచి నటుడు తమను వీడిపోవడంపై బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: