ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశాల‌న్నీ వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా బుధవారం 1,888 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 31,38,296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 172 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 2,17,985 మంది మరణించారు.  అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో కొత్త పాజిటీవ్ కేసులు నమోదుకాలేదు. మొత్తం కేసుల సంఖ్య 10,35,765 ఉండగా, ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు.

 

అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 59,266 మంది మృతిచెందారు. ఇక స్పెయిన్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. స్పెయిన్‌లో మొత్తం 2,32,128 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 23,822 మంది చనిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: