ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం  చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. రామడుగు మండలం వెదురుగట్ట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు ఆలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ రైతులు రాస్తారోకోకు దిగారు. సిరిసిల్లలో కూడా రైతులు ఆందోళన బాట పట్టారు. 
 
ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. వర్షాలు పడటంతో ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రభుత్వం ధాన్యం త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, అకాలవర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోళ్లలో అధికారులు వేగం పెంచాలని, ప్రభుత్వo ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పడుతున్న సమస్యల గురించి తక్షణమే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: