IHG

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఎక్కడి వారు అక్కడ చిక్కుకు పోయారు. తమ సొంత ఊర్లకు వెళ్లలేక వచ్చిన ఊరిలో తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న వలసకూలీలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈమేరకు మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 62 వేలమంది వలస కూలీలను గుర్తించినట్లు అయన వెల్లడించారు. వీరందరిని కూడా వారివారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీరంతా కూడా మిర్చి , ప్రతి మరియు పొగాకు వంటి పంటల కూలీలు గా వచ్చినట్లు మంత్రి తెలియజేసారు.

IHG

 

 

అయితే గుంటూరు ప్రాంతంలో సుమారు 45 వేలమంది వాలకూలీలు ఉన్నట్లు అయన వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆంధ్రాకి సంబందించిన వలస కూలీలను ఎట్లా తీసుకు వచ్చామో అట్లానే ఇక్కడున్న ఇతర ప్రాంతాల వలసకూలీలను తిరిగి వారి స్వస్థలాలకు పంపిస్తున్నట్లు అయన వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా ముందు గ్రీన్ జోన్ లనుంచి మొదలు పెడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదు అవుతున్న కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో గుర్తించిన సుమారు 16,700  మంది వలస కూలీలను తిరిగి పంపిస్తున్నట్లు అయన వివరించాడు. అన్ని గ్రీన్ జోన్ లు అయిపోయాక ఆరంజ్ జోన్లను ఆపై రెడ్ జోన్ ల పరిధిలోని నాట్ ఎఫెక్టడ్  ప్రజలను పంపిస్తున్నట్లు అయన వివరించారు ...

మరింత సమాచారం తెలుసుకోండి: