కరోనా భయంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే దాయాది పాకిస్థాన్ భారతదేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా ఎన్కౌంటర్ తో ఉలిక్కిపడింది. ఇంటిలిజెన్స్ కథనం మేరకు ఇండియాలో పాకిస్తాన్ వైపునుండి పెను ఉగ్రవాదం పొంచి ఉంది అన్న సమాచారంతో భారత బలగాలు కట్టుదిట్టమైన పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా సోకిన ఉగ్రవాదులు భారత్ వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా వారిని ఎదుర్కొంది. ఆనాటి నుంచీ ఇప్పటి వరకూ ఇండియన్ ఆర్మీ కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తూ నే ఉంది. రీసెంట్ గా జమ్మూకాశ్మీర్లో  షోపియన్‌ జిల్లాలోని మెల్‌హురా ప్రాంతంలో ఇండియన్ పోలీసుల కి  మరియు ఉగ్రవాదుల మధ్య పరస్పర ఎన్కౌంటర్ జరిగింది.

IHG

పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు ఇక పోలీసులు తనిఖీ లలో  ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ  ఉగ్రవాదులు చనిపోగా ఆ ఏరియా లో నే ఇంకొకరి జాడ తెలియాల్సి ఉంది. ఆ మూడవ ఉగ్రవాది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారని సోషల్ మీడియా  ద్వారా వారు తెలియజేశారు. ఇప్పటికే మృతి చెందిన ఆ ఇద్దరి ఉగ్రవాదుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు  ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో కూడా ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలియజేశారు. ఇటీవల కుల్గామ్ ప్రాంతంలో కూడా పోలీసులు ఉగ్రవాదులను గుర్తించి హతమార్చారు. పోలీసులు భద్రతా బలగాలు పట్టణంలో కుంబింగ్ చేపట్టారు ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి ఈ ఘటనలో కూడా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు ‌ 

 

మరింత సమాచారం తెలుసుకోండి: